అక్కినేని అమల క్లాప్.. అవసరాల 'ఎన్ ఆర్ ఐ' సినిమా ప్రారంభం
- అవసరాల హీరోగా 'నాయనా రారా ఇంటికి'
- రొమాంటిక్ కామెడీతో కూడిన కథ
- కథానాయికగా 'మహతి' పరిచయం
ఈ వేడుకలో సిరివెన్నెల .. నాగబాబు .. మంచు లక్ష్మి .. అమల అక్కినేని .. అఖిల్ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు మాట్లాడుతూ .. "నేను 21 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడ .. అక్కడ నాకు ఎదురైన అనుభవాలను ఒక కథగా రాసుకుని, 'ఎన్ ఆర్ ఐ' పేరుతో తెరపైకి తీసుకురానున్నాను. రొమాంటిక్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంది" అని చెప్పారు. ఈ సినిమా ద్వారా 'మహతి' అనే తెలుగు అమ్మాయి కథానాయికగా పరిచయమవుతోంది.