నిఖిల్ హీరోగా సాయి కొర్రపాటి మూవీ
- నిఖిల్ హీరోగా 'ముద్ర'
- నెక్స్ట్ మూవీ దర్శకుడిగా అవసరాల
- త్వరలోనే సెట్స్ పైకి
సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. 'ముద్ర' సినిమాను పూర్తి చేసి, ఆ వెంటనే అవసరాలతో కలిసి నిఖిల్ సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. ముందుగా ఈ సినిమాను నాగచైతన్యతో చేయాలనుకున్నారట. కానీ ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన నిఖిల్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.