ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయండి.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు: వాట్సాప్‌ను హెచ్చరించిన కేంద్రం
- వాట్సాప్ సీఈవోతో కేంద్రమంత్రి రవిశంకర్ భేటీ
- ఫేక్ న్యూస్ అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశం
- ఫేక్‌న్యూస్‌ను ఎవరు పుట్టిస్తున్నారో తెలుసుకోండి
తప్పుడు వార్తలు విపరీతంగా షేర్ అవుతూ మూక హత్యలకు కారణం అవుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాల్సిందిగా డేనియల్స్‌కు సూచించారు. భారత్‌లో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తామని డేనియల్స్ హామీ ఇచ్చారు. ఫేక్ న్యూస్ ప్రసారం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.