నానితో ఇప్పట్లో లేనట్టే .. కొత్త హీరోతో అవసరాల
- నటుడిగా అవసరాలకి మంచి పేరు
- దర్శకుడిగా దక్కిన విజయాలు
- నానితో సినిమాకి మరింత సమయం
దర్శకుడిగా అవసరాల తనని తాను నిరూపించుకోవడం వలన .. ఆయనతో గల సాన్నిహిత్యం కారణంగా నాని చేసే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ఇంతవరకూ ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. అందుకు కారణం నాని బిజీగా వుండటమేననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఒక కొత్త హీరోతో సినిమా చేయడానికి అవసరాల సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా పూర్తయ్యేలోగా నాని కోసం మంచి కథను సిద్ధం చేసుకునే ఆలోచనలో అవసరాల వున్నాడని చెప్పుకుంటున్నారు.