హైదరాబాద్ లో దారుణం... స్నేహితురాలిని రిసార్ట్స్ కు తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు!
- స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని వేధించిన సాయిప్రసాద్
- అంగీకరించకపోవడంతో అత్యాచారానికి యత్నం
- ఆపై గొంతు కోసి హత్య - విచారిస్తున్న పోలీసులు
ఆపై లైంగిక దాడికి యత్నించగా, శిరీష తీవ్రంగా ప్రతిఘటించింది. దాదాపు మూడు గంటల పాటు ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన సాయిప్రసాద్ విఫలమయ్యాడు. ఆమె బయటకు వెళితే, జరిగిన విషయం చెప్పేస్తుందని భావించిన సాయి ప్రసాద్, ఆమె గొంతుకోసి హతమార్చాడు. ఆపై సాయి బయటకు వెళ్లిపోగా, ఆ తర్వాత రిసార్ట్స్ నిర్వాహకులు విగతజీవిగా పడివున్న శిరీషను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై గంటల వ్యవధిలోనే సాయిప్రసాద్ పోలీసులకు పట్టుబడగా, ప్రస్తుతం సాయిని విచారిస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసీ సజ్జన్నార్ వెల్లడించారు.