షూటింగ్ అయ్యాక ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి వెళ్లమన్న యువకులు .. సారీ చెప్పిన విజయ్!
- చెన్నై బీచ్ లో సినిమా షూటింగ్స్
- అందువలన ఏర్పడిన చెత్తా చెదారం
- శుభ్రం చేసి వెళ్లమంటూ ఆగ్రహం
ఈ రెండు సినిమాల షూటింగ్స్ కారణంగా ఆ బీచ్ లో విరిగిపోయిన వస్తువులు .. పగిలిపోయిన గాజు ముక్కలు .. చెత్తా చెదారం పడ్డాయి. వాటిని అక్కడ అలాగే వదిలేసి ఎవరికివాళ్లు బయల్దేరుతున్నారట. అది గమనించిన సర్ఫింగ్ క్రీడాకారులు, ఈ సినిమా టీమ్స్ ను అడ్డుకున్నారు. బీచ్ ను శుభ్రం చేసిన తరువాతనే అక్కడి నుంచి వెళ్లాలని చెప్పడంతో అలాగే చేశారట. ఈ విషయంపై హీరో విజయ్ స్పందిస్తూ ఫేస్ బుక్ ద్వారా సారీ చెప్పగా .. అలాగే మణిరత్నం మద్రాస్ టాకీస్ ప్రతినిధి కూడా పొరపాటు జరిగిందంటూ స్పందించారు.