పెళ్లి కాని శ్రీరెడ్డీ, నీకు ఇంత పెద్ద కూతురు ఎలా వచ్చింది?... ఆ డబ్బు ఎలా వచ్చింది?: కరాటే కల్యాణి ప్రశ్న
- ఖరీదైన కార్లలో ఎలా తిరగగలుగుతున్నావు?
- కోటిన్నర పెట్టి ఆ ఫ్లాట్ ఎలా కొన్నావు?
- శ్రీరెడ్డిపై కరాటే కల్యాణి ప్రశ్నల వర్షం
విమల (శ్రీరెడ్డి) కు కుటుంబంతో 10 సంవత్సరాల నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్ పల్లిలో లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువగల ఫ్లాట్ లో, తల్లితో కలిసి ఎలా గృహప్రవేశం చేసింది? ఖరీదైన కార్లలో తిరగడానికి, ఆ ఫ్లాట్ కొనడానికి డబ్బులెలా వచ్చాయో ఏంటో విమలా నీకే తెలియాలి. ఇంకొన్ని విషయాలను నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తాను. ఎందుకంటే నా లీక్స్ నా ఇష్టం’’ అంటూ కరాటే కల్యాణి పేర్కొంది.