నాని కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడట!
- నటుడిగా అవసరాలకి మంచి పేరు
- దర్శకుడిగానూ ప్రత్యేకత
- నానితో సినిమా చేయడానికి ప్రయత్నాలు
నానితో ఓ సూపర్ హిట్ మూవీ చేస్తానని కొంతకాలం క్రితమే అవసరాల చెప్పాడు. నానికి పెరుగుతోన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయన కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్టు సన్నిహితులతో అవసరాల చెబుతున్నాడట. నాని కెరియర్లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నాడట. ప్రస్తుతం నాని చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తి కాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. తాజాగా నాని నిర్మించిన 'అ!' సినిమాలో అవసరాల ఓ కీలకమైన పాత్రను చేసిన సంగతి తెలిసిందే.