Anantapur District: ఇక హీరోయిన్ అయ్యే చాన్స్ లేదంటూ గుంతకల్లు యువతి ప్రాణార్పణం!

  • హీరోయిన్ గా రాణించాలని కలలుగన్న ప్రవీణ
  • వివాహం చేయాలని తలపెట్టిన తల్లిదండ్రులు
  • మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య

ఒకే ఒక్క చాన్స్ ను ఎలాగైనా సంపాదించి సినిమా హీరోయిన్ గా రాణించాలన్నది ఆ అమ్మాయి కోరిక. ఇక ఆ కోరిక తీరదని భావించి ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కన్నీరు మిగిల్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణ పరిధిలోని గంగానగర్ కు చెందిన పెద్దన్న, లీలావతి దంపతుల కుమార్తె ప్రవీణ (17).

ఈమెకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఆమెకు వివాహం చేయాలని తలపెట్టి, సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, తనకు వివాహమైతే, ఇక హీరోయిన్ కల తీరదన్న మనస్తాపంతో ప్రవీణ తన ఇంట్లోనే ఉరేసుకుని మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Anantapur District
Guntakal
Praveena
Sucide
Heroin
  • Loading...

More Telugu News