పెద్ద హీరోలతో చేయకపోవడానికి కారణం అదే!: అవసరాల శ్రీనివాస్
- 'ఒక్క క్షణం'లో నా పాత్ర బాగుంటుంది
- దర్శకుడిగా వచ్చేనెలలో సినిమా
- కథ నేను రెడీ చేసుకున్నదే
దర్శకుడిగా తన తదుపరి సినిమా వచ్చే నెలలో ఉంటుందనీ, ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని చెప్పాడు. "ఈ సినిమా కూడా నేను తయారు చేసుకున్న కథతోనే ఉంటుంది. పెద్ద హీరోలతో సినిమాలు చేయడం అనుకున్నంత తేలిక కాదు. వాళ్ల సలహాలు .. సూచనల మేరకు కథలో మార్పులు - చేర్పులు చేయవలసి ఉంటుంది. డేట్స్ విషయంలోను సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ కారణంగానే పెద్ద హీరోలతో సినిమాలు చేయడం లేదు" అని చెప్పుకొచ్చాడు.