హాస్యనటుడు విజయ్ ఆత్మహత్యకు కారణం అది కాదు: సినీనటుడు ధన్‌రాజ్
- సినిమాల్లో అవకాశం రాక ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు
- విజయ్ ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో చేస్తున్నాడు
- పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు
- విజయ్ తల్లి పరిస్థితి చూస్తోంటే చాలా బాధేస్తోంది
విజయ్ ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు చేస్తున్నాడని ధన్‌రాజ్ తెలిపాడు. విజయ్‌కి వ్యక్తిగత కష్టాలు ఏమున్నాయో తనకు తెలియదని అన్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని చెప్పాడు. ఏదేమైనా విజయ్ ఇటువంటి ఘటనకు పాల్పడకుండా ఉండి ఉంటే బాగుండేదని అన్నాడు. విజయ్ తల్లి పరిస్థితి చూస్తోంటే చాలా బాధేస్తోందని వ్యాఖ్యానించాడు.