'ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్ లో విజయ్ ఆంటోని!
- విజయ్ ఆంటోని తాజా చిత్రంగా 'ఇంద్రసేన'
- ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు
- తదుపరి సినిమాగా 'ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్
- సీనియర్ నటి అంబిక రీ ఎంట్రీ
ఆయన నెక్స్ట్ మూవీగా 'ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్ వుండనున్నట్టు సమాచారం. సామాజిక సమస్యలను 'ట్రాఫిక్ రామస్వామి' ఎలా ఎదిరించాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో యువకుడైన రామస్వామిగా విజయ్ ఆంటోని .. వృద్ధుడైన రామస్వామిగా ఎస్.ఎ.చంద్రశేఖర్ నటించనున్నారు. సీనియర్ నటి అంబిక చాలా సంవత్సరాల తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇక త్వరలో రానున్న 'ఇంద్రసేన' సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.