దీపిక అభిమానులకు నవరాత్రి కానుక... `పద్మావతి` ఫస్ట్‌లుక్ విడుదల
ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ, రావల్ రతన్ సింగ్ పాత్రలు పోషిస్తున్న రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ కూడా దీపికా పదుకొనే లుక్‌ను షేర్ చేశారు. ఇలాంటి మహారాణి పాత్రలు దీపికా పదుకొనేకి కొత్తేం కాదు. అయినప్పటికీ పద్మావతి లుక్‌లో ఏదో కొత్తదనం కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.