యువరాజ్ సింగ్ కు 'తొలి' పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ!
'యువీ లేకుండా టీ20, వన్డే ప్రపంచ కప్ గెలవడం ఊహించగలమా? అతనే అసలైన మ్యాచ్ విన్నర్' అంటూ సర్ జడేజా తెలిపాడు. 'మన స్నేహం విడిపోనిది' అని మహ్మద్ కైఫ్ అంటే, 'భారత్ ఛాంపియన్, పెద్దన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నీ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. త్వరలోనే నిన్ను కలుసుకుంటాను' అంటూ వర్థమాన క్రికెటర్ హార్డిక్ పాండ్య తెలిపాడు. 'డ్రెస్సింగ్ రూం నుంచి నిండిపోయిన మైదానాలు, జయాలు, అపజయాలు అన్నీ కలిసే చూశామ'ని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తెలిపాడు. 'అతను 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మరి 6 బంతుల్లో అతను కొట్టిన 36 పరుగుల మాటేమిటి?' అంటూ ఐసీసీ అభినందించింది.