మీ జీవితంలో ఒంటరిగా ఉన్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
- ఒంటరితనం ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని తగ్గిస్తుందంటున్న తాజా అధ్యయనం
- మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడి
- పురుషుల్లో డిప్రెషన్, ఆందోళన లేకుండా జీవించే కాలాన్ని దాదాపు 6 ఏళ్లు తగ్గిస్తున్న ఒంటరితనం
- దాదాపు 2.77 లక్షల మందిపై యూకే బయోబ్యాంక్ డేటాతో పరిశోధకులు ఈ విశ్లేషణ
ఒంటరితనం కేవలం ఒక మానసిక భావనే కాదు, అది మన ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని గణనీయంగా తగ్గించేస్తుందని ఒక భారీ అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరితనంతో బాధపడేవారు, సామాజికంగా అందరికీ దూరంగా ఉండేవారు ప్రధానమైన శారీరక, మానసిక వ్యాధులు లేకుండా జీవించే సంవత్సరాల సంఖ్య తక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కీలక అధ్యయన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్ కమ్యూనికేషన్స్'లో ప్రచురితమయ్యాయి.
ఈ పరిశోధన కోసం యూకే బయోబ్యాంక్‌కు చెందిన 2,77,489 మంది డేటాను విశ్లేషించారు. అధ్యయనం ప్రారంభంలో 40 నుంచి 69 ఏళ్ల వయసున్న వీరంతా ఏడు రకాల ప్రధాన దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, న్యూరోడెజనరేటివ్ సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటివి వీరిలో లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఈ విశ్లేషణ చేపట్టారు. 50 ఏళ్ల వయసు నుంచి వ్యాధులు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించగలరనే అంచనాలను ఈ అధ్యయనం ద్వారా లెక్కించారు.
ఒంటరితనం, సామాజిక ఏకాంతం మధ్య తేడా
ఈ అధ్యయనంలో పరిశోధకులు రెండు కీలక అంశాలను స్పష్టంగా వేరు చేసి చూపారు. ఒంటరితనం అంటే అర్థవంతమైన సంబంధాలు లేవని వ్యక్తిగతంగా అనుభూతి చెందడం. ఇది పూర్తిగా మానసికమైనది. సామాజిక ఏకాంతం (Social Isolation) అంటే భౌతికంగా ఇతరులతో పరిమితంగా కలవడం లేదా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం. ఈ రెండూ వేర్వేరు అయినప్పటికీ, రెండూ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలింది.
అధ్యయనంలో ఏం తేలింది?
ఒంటరితనం, సామాజిక ఏకాంతం రెండూ అనుభవిస్తున్న వారిలో ఆరోగ్యంగా జీవించే కాలం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఈ సమస్యలు లేని వారితో పోలిస్తే, ఈ రెండు సమస్యలతో బాధపడే మహిళలు సగటున 3 సంవత్సరాలు, పురుషులు 2.2 సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని కోల్పోతున్నారని అంచనా వేశారు.
అయితే, మానసిక ఆరోగ్యం విషయంలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంది. ఒంటరితనం, సామాజిక ఏకాంతంతో బాధపడే పురుషులు.. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు లేకుండా జీవించే కాలాన్ని ఏకంగా 5.8 సంవత్సరాలు కోల్పోతున్నారు. మహిళల్లో ఈ నష్టం 3.7 సంవత్సరాలుగా ఉంది. శారీరక వ్యాధుల విషయంలో ఈ ప్రభావం కాస్త తక్కువగా కనిపించింది. మహిళలు 2.4 ఏళ్లు, పురుషులు 1.7 ఏళ్ల ఆరోగ్యకరమైన కాలాన్ని కోల్పోతున్నట్లు తేలింది.
ఆరోగ్యకరమైన జీవనశైలి, అంటే ధూమపానం చేయకపోవడం, సరైన బరువు, వ్యాయామం, మంచి ఆహారం, నిద్ర వంటివి సామాజిక ఏకాంతం వల్ల కలిగే నష్టాన్ని కొంతమేర తగ్గించగలవని పరిశోధకులు గుర్తించారు. అయితే, ఒంటరితనం విషయంలో ఈ ప్రభావం అంత స్పష్టంగా లేదు.
ఈ అధ్యయనం కేవలం పరిశీలనాత్మకమైనదేనని, ప్రత్యక్ష కారణాలను ఇది నిరూపించదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి బలమైన సామాజిక సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.