గతాన్ని తలచుకుంటూ బాధపడుతున్నారా? ప్రశాంతంగా జీవించేందుకు ఈ 5 సూత్రాలు
- ప్రతి ఫలితాన్ని నియంత్రించాలనే ఆలోచనను తగ్గించుకోవాలి
- ఇతరుల మెప్పుపైనే మన ఆనందం ఆధారపడకూడదు
- ప్రస్తుత క్షణాల్లోని ఆనందాన్ని ఆస్వాదించాలి
- మార్చలేని పరిస్థితులను అంగీకరించడం నేర్చుకోవాలి
- నిరాశను అనుభవించేందుకు మనసుకు సమయం ఇవ్వాలి
మనల్ని ఎక్కువగా అలసటకు గురిచేసేవి బాధ్యతలు మాత్రమే కాదు.. ప్రతి విషయం మనం అనుకున్నట్లే జరగాలనే ఆలోచన కూడా. ఎదుటివారు మనల్ని అర్థం చేసుకోవాలని, అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలని, బంధాలు ఎప్పటికీ మారకుండా ఉండాలని కోరుకుంటాం. కానీ జీవితం మన అంచనాలకు భిన్నంగా సాగినప్పుడు నిరాశ, ఆందోళన మనల్ని చుట్టుముడతాయి. ఇలాంటి సమయంలో మనసును తేలికగా ఉంచుకోవడానికి ఉపయోగపడే మార్గమే నాన్ అటాచ్మెంట్ (Non-attachment). అంటే మనుషులపై ప్రేమను తగ్గించుకోవడం, లక్ష్యాలను వదిలేయడం కాదు. ఏదైనా ఫలితం మనకు అనుకూలంగా లేకపోయినా మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటం. రోజువారీ జీవితంలో ఈ అలవాటును పెంచుకోవడానికి ఐదు మార్గాలు ఉన్నాయి.
1. ప్రతి ఫలితాన్ని నియంత్రించాలనుకోవద్దు
ఉద్యోగ ఇంటర్వ్యూకు బాగా సిద్ధం కావచ్చు. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడొచ్చు. బంధం నిలబెట్టుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఫలితం మాత్రం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. అందుకే ప్రతి విషయం మనం అనుకున్నట్లే జరగాలని పట్టుబట్టకుండా, మన పరిధిలో ఉన్న పనులను శ్రద్ధగా చేయడంపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే అనవసరమైన ఆందోళన తగ్గుతుంది.
2. ఎదుటివారిని వారిలా ఉండనివ్వండి
మనకు ఇష్టమైనవారు మనల్ని అర్థం చేసుకోవాలని, మనకు నచ్చినట్లే ప్రవర్తించాలని కోరుకోవడం సహజం. కానీ ప్రతి ఒక్కరూ మన ఆలోచనలకు అనుగుణంగా మారాలని ఆశిస్తే నిరాశ తప్పదు. ఎదుటివారి మాటలను వెంటనే తప్పుపట్టకుండా వినడం అలవాటు చేసుకోవాలి. ఒకరిని ప్రేమించడం అంటే వారి ఆలోచనలు, భావాలు, నిర్ణయాలన్నింటినీ మనం నియంత్రించాలని కాదు. వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం కూడా ప్రేమలో భాగమే.
3. ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూడకండి
ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. అదే ఎవరైనా విమర్శిస్తే ఆ మాటలనే గంటల తరబడి తలచుకుంటాం. మన నిర్ణయాలు ఇతరులకు నచ్చాయా? లేదా? అనే దానిపై మన సంతోషం ఆధారపడుతోందా అని ఒక్కసారి ఆలోచించాలి. ఇతరుల అభిప్రాయాలు మనల్ని మెరుగుపరచడానికి ఉపయోగపడవచ్చు. కానీ అవే మన విలువను నిర్ణయించకూడదు. మనపై మనకు నమ్మకం పెంచుకోవడం ముఖ్యం.
4. మంచి క్షణాలను ఆస్వాదించండి
కుటుంబంతో గడిపే సమయం, ఇష్టమైన వ్యక్తితో చేసే సంభాషణ, ప్రశాంతంగా గడిచే ఒక సాయంత్రం.. ఇలాంటి క్షణాలు ఎంతో విలువైనవి. అయితే ఇవన్నీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అవి ఎప్పుడు ముగుస్తాయోనని ముందే బాధపడుతుంటాం. జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. అందుకే భవిష్యత్తులో ఏమవుతుందోనని ఆందోళన చెందకుండా, ప్రస్తుతం మనకు లభించిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించాలి.
5. మార్చలేని విషయాలను అంగీకరించడం నేర్చుకోండి
కొన్ని ప్రశ్నలకు మనకు కావాల్సిన సమాధానాలు దొరకకపోవచ్చు. కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు. మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పరిస్థితులు మారకపోవచ్చు. జరిగిన ప్రతి విషయాన్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు. కానీ అది జరిగిపోయిందనే వాస్తవాన్ని అంగీకరించాలి. బాధగా అనిపిస్తే ఆ భావనకు కొంత సమయం ఇవ్వాలి. జరిగిన దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని గుర్తించి, ఇకపై ఏం చేయాలో నిర్ణయించుకోవాలి.
జీవితంలో ప్రతి మనిషిని, ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చలేం. కానీ వాటి పట్ల మనం ఎలా స్పందించాలో నేర్చుకోవచ్చు. వదులుకోవడం అంటే ప్రేమను కోల్పోవడం కాదు.. మనశ్శాంతిని దెబ్బతీసే పట్టుదలను తగ్గించుకోవడం. ఈ చిన్న మార్పు మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా మార్చగలదు.