టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2027 వరకు హార్దిక్ పాండ్యా దూరమేనా?
- ఐపీఎల్ 2027 వరకు ఆటకు పాండ్యా దూరమయ్యే అవకాశం ఉందంటున్న నివేదికలు
- బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స
- మరో మూడు వారాల తర్వాత జాగింగ్ ప్రారంభించే అవకాశం
- ఆ తర్వాత ఎనిమిది వారాల్లో పరుగుల సాధన క్రమంగా పెంపు
- శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌లకు దూరమయ్యే ప్రమాదం
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు నిరాశ కలిగించే వార్త. అతడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. కాలి కండరాల లోపలి భాగంలో ఏర్పడిన స్ట్రెస్ గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్.. వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న ఐపీఎల్ 2027 వరకు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండొచ్చని తెలిపింది. అయితే, అతడి పునరాగమనంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం హార్దిక్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాస చికిత్స తీసుకుంటున్నాడు. ‘దైనిక్ జాగరణ్’ కథనం ప్రకారం.. అతడి వైద్య నివేదికలను గత వారం డాక్టర్ దిన్షా పార్దివాలా పరిశీలించారు. వైద్యుల సూచనల మేరకు దశలవారీగా ఫిట్నెస్ సాధించే కార్యక్రమాన్ని హార్దిక్ కొనసాగిస్తున్నాడు.
పునరావాస ప్రణాళిక ప్రకారం మరో మూడు వారాల తర్వాత అతడు నెమ్మదిగా జాగింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాతి ఎనిమిది వారాల్లో పరుగెత్తే సమయాన్ని, తీవ్రతను క్రమంగా పెంచనున్నారు. గాయంపై మళ్లీ ఒత్తిడి పడకుండా స్ట్రెంత్ ట్రైనింగ్‌ను కూడా జాగ్రత్తగా పెంచుతున్నారు. పూర్తి స్థాయి మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఈ పరిస్థితి కొనసాగితే డిసెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంకతో వన్డేలు, టీ20ల సిరీస్‌కు హార్దిక్ దూరమయ్యే అవకాశం ఉంది. జనవరి 3 నుంచి జరగనున్న జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనూ ఆడకపోవచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటికే అతడు న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు.
2026లోనూ హార్దిక్ పలు సిరీస్‌లకు దూరమయ్యాడు. అతడు చివరిసారిగా ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున మే నెలలో మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో చివరిసారిగా మార్చిలో జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కనిపించాడు. హార్దిక్ త్వరగా కోలుకోవడం టీమిండియాకు కీలకం కానుంది.