ప్రేయసి కోసం ఆస్తులన్నీ అమ్ముకుని వెళితే.. ఆమె మనిషే కాదని తెలిసింది!
- ఆన్లైన్లో పరిచయమైన మహిళతో ప్రేమలో పడిన బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి
- ఆమెను కలిసేందుకు తన ఆస్తులన్నీ అమ్ముకుని సుదీర్ఘ ప్రయాణం
- దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించిన వైనం
- తీరా అక్కడికి వెళ్లాక తాను ప్రేమించింది మనిషిని కాదని, ఏఐ క్యారెక్టర్ అని తెలిసి షాక్
- డబ్బులు అయిపోవడంతో సామాజిక కార్యకర్తల సహాయంతో సొంత ఊరికి!
ఆన్లైన్ ప్రపంచంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం రోజురోజుకూ కష్టంగా మారుతోంది. బ్రెజిల్లో జరిగిన ఓ సంఘటన దీనికి నిలువుటద్దంలా నిలుస్తోంది. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ప్రేమించి, ఆమెను కలిసేందుకు ఉన్నదంతా అమ్ముకుని వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తీరా అక్కడికి వెళ్లాక, తాను ప్రేమించింది నిజమైన మహిళను కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టించిన ఓ క్యారెక్టర్ అని తెలిసి నిర్ఘాంతపోయాడు.
వివరాల్లోకి వెళితే, బ్రెజిల్‌లోని ఇంపిరాట్రిజ్కు చెందిన 49 ఏళ్ల ఎడిమర్ రోచా మార్టిన్స్ వృత్తిరీత్యా ఓ తాపీ మేస్త్రీ. తల్లి మరణం తర్వాత కొంతకాలంగా ఒంటరితనంతో బాధపడుతున్న అతనికి, సుమారు 2020లో సోషల్ మీడియాలో ‘జెస్సికా ఒలివిరా’ పేరుతో ఉన్న ఓ ప్రొఫైల్ పరిచయమైంది. జెస్సికా ప్రొఫైల్‌లోని అందమైన యువతి ఫోటోలు, వీడియోలు మార్టిన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులో ఆమె తనను తాను వితంతువుగా పరిచయం చేసుకుని, తనతో పొలంలో నివసించడానికి ఒంటరిగా ఉన్న పురుషులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది. వారు పని చేయాల్సిన అవసరం లేదని, ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పడంతో మార్టిన్స్ ఆమెను పూర్తిగా నమ్మాడు.
ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మార్టిన్స్, తన సర్వస్వాన్ని అమ్ముకుని అక్టోబర్ తొలివారంలో బస్సులో సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు. దాదాపు 36 గంటల పాటు ప్రయాణించి, సుమారు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలొ హారిజొంటె నగరానికి చేరుకున్నాడు. నగరానికి చేరుకున్న మార్టిన్స్, జెస్సికా ఫోటోను పట్టుకుని వీధులన్నీ తిరుగుతూ ఆమె గురించి ఆరా తీశాడు. కానీ, ఎవరికీ ఆమె ఎవరో తెలియలేదు. చివరికి తాను మోసపోయానని, అది ఒక ఏఐ సృష్టించిన కల్పిత పాత్ర అని గ్రహించి తీవ్ర నిరాశకు గురయ్యాడు.
టిక్‌టాక్‌లో @JessicaFazendeira పేరుతో ఉన్న ఈ ఖాతాకు 3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ వివాదం తర్వాత, ఆ ప్రొఫైల్ క్రియేటర్ స్పందిస్తూ.. మార్కెటింగ్, వస్తువుల అమ్మకాల కోసమే ఆ ఏఐ క్యారెక్టర్‌ను సృష్టించామని, తామెప్పుడూ మార్టిన్స్‌తో వ్యక్తిగతంగా చాట్ చేయలేదని, ప్రయాణించమని ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ ఖాతాను సోషల్ మీడియా నుంచి తొలగించారు.
చేతిలో డబ్బులు అయిపోవడంతో, మార్టిన్స్ స్థానిక సిటీ హాల్‌ను ఆశ్రయించి సామాజిక కార్యకర్తల సహాయం కోరాడు. వారి సహకారంతో తిరిగి తన సొంత ఊరికి పయనమయ్యాడు. "జీవితంలో సంతోషంగా ఉండాలని, ఒక తోడు కోసం వచ్చాను. కానీ, ఇలా జరుగుతుందని ఊహించలేదు" అని మార్టిన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన, టెక్నాలజీ ఎంతగా ముసుగు వేయగలదో, ఆన్లైన్ సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తోంది.