కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్.. కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
- సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అరెస్టు
- ఎస్ఈఎం కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
- దీప్కే ఆచూకీ తెలియడం లేదన్న సీజేపీ లీగల్ సెల్
- తిరంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరణ
- ఐసా నేత నేహా బోరా అదుపులోకి.. తర్వాత విడుదల
- ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి సీజేపీ సహ కన్వీనర్లు
ఢిల్లీలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అరెస్టయ్యారు. శుక్రవారం కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్కులో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈరోజు ఆయనను ఎస్ఈఎం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే దీప్కే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని సీజేపీ లీగల్ సెల్ చీఫ్ రత్నా సింగ్ తెలిపారు.
ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ముందుగానే దీప్కేకు నోటీసులు ఇచ్చారు. కన్నాట్ ప్లేస్ గుర్తింపు పొందిన నిరసన స్థలం కాదని, తిరంగా యాత్రకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అనుమతి కూడా లేదని స్పష్టం చేశారు. ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతంలో ర్యాలీ నిర్వహించినా, జనాన్ని సమీకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని దీప్కే పోలీసులను ప్రశ్నించారు. తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించానని నిలదీశారు. జాతీయ జెండాను ప్రదర్శించడం నిషేధం కాదని, అయితే అనుమతి లేని ఊరేగింపులు, జనసమీకరణపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.
ఇదే సమయంలో ‘ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్’ నేత నేహా బోరాను కూడా మండీ హౌస్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమెను విడుదల చేశారు.
సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్టు కావడంతో ఢిల్లీలో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొంది. అక్టోబర్ 13న జంతర్ మంతర్లోకి ప్రవేశించి జాతీయ జెండాను ఎగురవేశారనే ఆరోపణలపై వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన సమయంలోనూ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వారంలో ఆయన పోలీసుల అదుపులోకి రావడం ఇది రెండోసారి.