అవసరమైతే ఆర్టీసీ భూములు అమ్మి అయినా చెల్లింపులు పూర్తి చేస్తాం: పొన్నం ప్రభాకర్
- రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తామని మంత్రి పొన్నం హామీ
- అవసరమైతే ఆర్టీసీ భూములు అమ్మి అయినా చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడి
- సీసీఎస్ బకాయిల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి
తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా ఇచ్చారు. వారి పెండింగ్ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ చెల్లింపుల కోసం అవసరమైతే విలువైన ఆర్టీసీ భూములను విక్రయించేందుకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన యునైటెడ్ ఫ్రంట్ నేతలతో పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించిన ఆయన... రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న బకాయిల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) బకాయిలతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పొన్నం ప్రభాకర్ వివరించారు. దీర్ఘకాలంగా పేరుకుపోయిన రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించడానికి భూముల అమ్మకం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. సుమారు 17,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రూ.980 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు గతంలో సంఘాలు వెల్లడించిన నేపథ్యంలో మంత్రి ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.