‘‘పాఠ్యపుస్తకాలు దాచిన నిజాలున్నాయ్’’.. 'రణబాలి'పై అన్నామలై ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘‘పాఠ్యపుస్తకాలు దాచిన నిజాలున్నాయ్’’.. 'రణబాలి'పై అన్నామలై ప్రశంసలు

Annamalai praises Ranabali says it reveals truths hidden in textbooks
  • బ్రిటీష్ పాలనలోని చీకటి కోణాలను ఆవిష్కరించే ప్రయత్నమంటూ అభినందన
  • విజయ్‌, డైరెక్టర్‌, సాయి దీపక్‌తో కలిసి సినిమా వీక్షించిన అన్నామలై
  • రణబాలి' వంటి చిత్రాలు అణచివేతను తెరపైకి తెస్తున్నాయని వ్యాఖ్య
  • దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఈ సినిమాపై తమిళనాడుకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు అన్నామలై ప్రశంసల వర్షం కురిపించారు. పాఠ్యపుస్తకాలు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన చారిత్రక నిజాలను ఈ చిత్రం కళ్లకు కడుతోందని ఆయన అభినందించారు.

విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో పాటు న్యాయవాది జె. సాయి దీపక్‌తో కలిసి అన్నామలై ఈ సినిమాపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ, బ్రిటీష్ వారు తమ పాలనలోని చీకటి కోణాలను దాచిపెట్టి, కేవలం మంచి మాత్రమే చేశారనే అభిప్రాయాన్ని కల్పించేలా చరిత్రను నిర్మించారని అన్నారు. విద్యాసంస్థలను నియంత్రించడం ద్వారా అనేక చారిత్రక వాస్తవాలను పాఠ్యపుస్తకాల్లోకి రాకుండా అడ్డుకున్నారని, 'రణబాలి' వంటి చిత్రాలు ఆ అణచివేతకు గురైన నిజాలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. దాదాపు 200 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో సంభవించిన ఓ భయంకరమైన కరవు, ఆ సమయంలో బ్రిటీష్ పాలకుల దురాగతాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ప్రధాన స్రవంతి చరిత్రలో చోటు దక్కని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది.

వలసవాద భావజాలం మన చరిత్రపై ఎలాంటి ప్రభావం చూపిందో ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చర్చకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రం దసరా కానుకగా 2026 అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Annamalai
Vijay Deverakonda
Ranabali Movie
Rahul Sankrityan
J Sai Deepak
South Indian History

More Telugu News