దేశం మొత్తం జంతర్ మంతర్‌గా మారుతుంది: కేంద్ర ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశం మొత్తం జంతర్ మంతర్‌గా మారుతుంది: కేంద్ర ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఫైర్

Prakash Raj slams Central Government says whole country will turn into Jantar Mantar
  • కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
  • ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడాన్ని సహించబోమన్న ప్రకాశ్ రాజ్
  • గతంలో బెంగళూరులో జరిగిన సీజేపీ నిరసనలో తాను కూడా పాల్గొన్నానని వెల్లడి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఆంక్షలు విధించడం, కాక్రోచ్ జనతా పార్టీ నేతలను అరెస్ట్ చేయడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఒక వీడియోలో, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరసన ప్రదేశాన్ని మార్చగలరేమో కానీ, ప్రజల గొంతును నొక్కలేరని ఆయన హెచ్చరించారు.

జాతీయ జెండాతో జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు అరెస్టు చేసి, ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ చర్యను ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. "మీరు నిరసన స్థలాన్ని మార్చగలరు, నిరసనను ఆపగలరు. కానీ ఈ దేశ ప్రజల గొంతును అణచివేయలేరు. దేశం మొత్తం జంతర్ మంతర్‌గా మారుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలను ప్రజలు సహించరని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.

గతంలో బెంగళూరులో జరిగిన సీజేపీ నిరసనలో తాను కూడా పాల్గొన్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎలక్టోరల్ రోల్స్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ కొంతకాలంగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజా అరెస్టులు చోటుచేసుకున్నాయి. 
Advertisement
Prakash Raj
Jantar Mantar Protests
Central Government
Cockroach Janata Party
Election Commission of India
Sourav Das Ashutosh Ranka

More Telugu News