ఏపీలో స్థానిక ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో స్థానిక ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల

AP Local Body Elections Schedule Release Tomorrow
  • ఏపీలో స్థానిక సమరానికి మోగిన నగారా!
  • మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు!
  • తొలి విడతలో మున్సిపల్ ఎన్నికలు
  • విజయవాడలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి, పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది.

మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. తొలి విడతలో పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా బుధవారమే విడుదల చేసే అవకాశాలున్నాయి. రెండో విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మూడో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి గెజిట్ నోటిఫికేషన్లు ఇప్పటికే ఎన్నికల సంఘానికి చేరాయి. దీంతో షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎం.జీ. రోడ్డులోని నూతన హెచ్‌ఓడీ భవనంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్ పునేఠా ఈ వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి మీడియాకు ఆహ్వానం పంపారు.
Advertisement
Anil Chandra Punetha
Andhra Pradesh local body elections
AP SEC election schedule
Andhra Pradesh municipal elections
MPTC ZPTC elections
AP Gram Panchayat elections

More Telugu News