విజయవాడలో తెలుగులో ప్రసంగించిన సీఎం విజయ్.. వీడియో ఇదిగో!
- బెజవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0
- హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
- తెలుగులో మాట్లాడి అందరినీ అలరించిన విజయ్
- తనను ఆహ్వానించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్.. విజయవాడలో తెలుగులో ప్రసంగించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో అట్టహాసంగా జరుగుతున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0' వేడుకలకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్, కాస్త తడబడుతూనే తెలుగులో మాట్లాడటం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
"అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ విజయ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగానే అక్కడున్న యువత కేరింతలతో హోరెత్తించారు. తన పర్యటన ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, "నదుల అనుసంధానం గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చించేందుకు విజయవాడ వచ్చాను" అని స్పష్టం చేశారు. తన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తనను ఆహ్వానించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవ్‌తో నగరంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని నిర్వాహకులను అభినందించారు. తమిళనాడు సీఎంగా గెలిచిన తర్వాత విజయ్ మొదటిసారి విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాలు వేరైనా తమ అభిమతం ఒక్కటేనని, దేశం బాగుపడాలని చంద్రబాబు అన్నారు. ఈ వేడుకలకు హాజరైన సీఎం విజయ్‌కు, కళాకారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.