కరెంట్, నీళ్లు ఇవ్వలేరు కానీ.. బుల్లెట్ ట్రైన్లు గురించి మాట్లాడుతున్నారు: సబితా ఇంద్రారెడ్డి
- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు
- బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ ఖరారు కాకుండానే భూసేకరణ చట్టవిరుద్ధమని ఆరోపణ
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలు బలవంతంగా లాక్కుంటున్నారని ధ్వజం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా అలైన్‌మెంట్ ఖరారు చేయని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె మండిపడ్డారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనను ప్రస్తావిస్తూ, బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదని, అలాంటప్పుడు బహదూర్‌గూడలో పోలీసుల రక్షణతో రైతుల భూములను ఎందుకు తీసుకున్నారని సబిత ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలను ప్రభుత్వం అనవసరంగా సేకరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డికి ఇంత భూదాహం ఎందుకో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పంటలు వేయవద్దని సలహా ఇస్తోందని... కనీసం కరెంట్, సాగు, తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఉందని ఆమె విమర్శించారు. మెట్రో టెండర్లు రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
కొత్వాల్‌గూడ నుంచి కొడంగల్‌కు కొత్త రహదారి అవసరం ఏముందని నిలదీశారు. భూములు అమ్మి పాలన చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. నాదర్‌గూల్‌లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, భూసేకరణ ఒత్తిడితో కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆమె హితవు పలికారు.