విజయవాడ చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్... విమానాశ్రయంలో ఘన స్వాగతం.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్... విమానాశ్రయంలో ఘన స్వాగతం.. వీడియో ఇదిగో!

Tamil Nadu CM Joseph Vijay reaches Vijayawada grand welcome at airport
  • గన్నవరం విమానాశ్రయంలో విజయ్‌కు స్వాగతం పలికిన మంత్రి నారాయణ
  • కాసేపట్లో కనకదుర్గమ్మను దర్శించుకోనున్న విజయ్
  • ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్న తమిళనాడు సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఏపీకి రావడం ఇదే తొలిసారి. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు, ఏపీ ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి సీఎం విజయ్ నేరుగా విజయవాడలోని ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. అక్కడ ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి రాజకీయంగా, పాలనాపరంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా అంతర్రాష్ట్ర జలాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కృష్ణా జలాల సరఫరా, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి కీలక అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు రానుంది.

చంద్రబాబుతో సమావేశం అనంతరం, సీఎం విజయ్ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0' కార్యక్రమంలో చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రాత్రి 9 గంటలకు గన్నవరం నుంచి తిరిగి చెన్నైకి పయనమవుతారు. తన పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో విజయ్ భేటీ అవుతున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ... ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.
Advertisement
Joseph Vijay
Chandrababu Naidu
Tamil Nadu CM Vijayawada visit
Telugu Ganga Project
Vijayawada Utsav 2.0
Andhra Pradesh Tamil Nadu CM meeting

More Telugu News