హ్యాక్ చేసి ఆహారాన్ని పాడుచేశారు.. ఫ్రాన్స్‌లో సైబర్ నేరగాళ్ల వింత దాడి
- ఫ్రాన్స్‌లో సైబర్ దాడితో వేడెక్కిన సూపర్‌మార్కెట్ల ఫ్రిజ్‌లు
- కొన్ని పరికరాల్లో 50 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
- ఇంటర్‌మార్షే, క్యారీఫోర్ సహా పలు సంస్థల దుకాణాలు ప్రభావితం
- పాడైన మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్
- పాత కంట్రోలర్ సాఫ్ట్‌వేర్‌పై అనుమానాలు
సూపర్‌మార్కెట్‌లో ఫ్రిజ్‌లు చల్లగా ఉండాలి.. ఫ్రీజర్లు మంచు గడ్డకట్టించాలి. కానీ హ్యాకర్లు వాటినే లక్ష్యంగా చేసుకున్నారు. వాటిని ఆహారం వేడి చేసుకునే ఒవెన్లుగా మార్చేశారు. ఒక్కో ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరేలా చేశారు. దీంతో ఫ్రాన్స్‌లో వందలాది సూపర్‌మార్కెట్లలో మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్ వంటి ఆహార పదార్థాలు పాడయ్యాయి. కొన్ని చోట్ల పరికరాలు వేడెక్కడంతో మంటలు కూడా చెలరేగాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించకుండానే.. కీలక వ్యవస్థలను దెబ్బతీసి భారీ నష్టం కలిగించవచ్చని ఈ ఘటన చాటిచెప్పింది.
ఫ్రిజ్‌లను వేడెక్కించిన హ్యాకర్లు
అక్టోబర్ 11, 12 తేదీల మధ్య ఈ సైబర్ దాడి వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌మార్షే, క్యారీఫోర్, కోఆపరేటివ్ యూ, ఈ.లెక్లెర్క్ వంటి ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థల దుకాణాలు ప్రభావితమయ్యాయి. ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు చల్లదనాన్ని కోల్పోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. కొన్ని పరికరాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరాయి. దీంతో పాడైన ఆహారాన్ని తొలగించి, కొన్ని చోట్ల ఫ్రీజర్ విభాగాలను తాత్కాలికంగా మూసివేశారు.
వందలాది దుకాణాలపై ప్రభావం
ఇంటర్‌మార్షేకు చెందిన కనీసం 150 దుకాణాలు ప్రభావితమైనట్లు తొలుత సమాచారం వెలువడింది. నెట్టో బ్రాండ్ దుకాణాలను కలిపితే ఈ సంఖ్య 300 వరకు ఉండొచ్చని కొన్ని నివేదికలు తెలిపాయి. కోఆపరేటివ్ యూకు చెందిన దాదాపు 100 దుకాణాలు, క్యారీఫోర్‌కు చెందిన సుమారు 80 దుకాణాల్లో సమస్యలు తలెత్తాయి. ఈ.లెక్లెర్క్ దుకాణాల్లోనూ కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. మోనోప్రిక్స్ దుకాణాల్లోనూ ప్రభావం కనిపించింది. పాడైన సరుకును పారేయాల్సి రావడంతో సంస్థలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.
పాత సాఫ్ట్‌వేర్ లోపాలే కారణమా?
సూపర్‌మార్కెట్లలో వందలాది ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లను ఒకే డిజిటల్ వ్యవస్థ ద్వారా నియంత్రిస్తారు. సాంకేతిక సిబ్బంది దూరం నుంచే వాటి ఉష్ణోగ్రతలను మార్చగలరు. ఈ సదుపాయాన్నే హ్యాకర్లు దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. డాన్‌ఫాస్ సంస్థకు చెందిన కొన్ని కంట్రోలర్లలో పాత ఫర్మ్‌వేర్ వాడటం వల్ల సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే దాడి వెనుక ఎవరున్నారు? ఏ లోపాన్ని ఉపయోగించారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆహార భద్రతకు ముప్పు
ఫ్రిజ్‌లలో ఉష్ణోగ్రతలు పెరిగితే ఆహారంలో బ్యాక్టీరియా వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. బయటకు బాగానే కనిపించినా కొన్ని పదార్థాలు తినడానికి సురక్షితం కాకపోవచ్చు. అందుకే అనుమానం ఉన్న ఆహారాన్ని విక్రయించకుండా తొలగించారు. ఫ్రాన్స్ సైబర్ రక్షణ సంస్థ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. డిజిటల్ వ్యవస్థల భద్రతతో పాటు ఆహార నిల్వలకు ఉపయోగించే పరికరాల రక్షణ కూడా ఎంత ముఖ్యమో ఈ దాడి స్పష్టం చేసింది.