వివాహ బంధం బలంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 5 ప్రశ్నలు వేసుకోండి!
- సామాజిక ఒత్తిడితో కాకుండా ఇష్టంతో పెళ్లికి సిద్ధపడాలని వారికూ సూచన
- విభేదాలను గౌరవంగా పరిష్కరించుకునే సామర్థ్యం ముఖ్యమని వెల్లడి
- ఆదాయం, ఖర్చులు, పొదుపుపై ముందుగానే చర్చించాలని సూచన
- వ్యక్తిగత స్వేచ్ఛకు వివాహంలోనూ చోటుండాలని సలహా
- పిల్లలు, కుటుంబ బాధ్యతలు, నివాసంపై స్పష్టత అవసరమని హితవు
వివాహం అంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు జీవితాలు, బాధ్యతలు, ఆలోచనలు ఒక్కటయ్యే ప్రయాణం. అందుకే పెళ్లికి ముందు ప్రేమ ఒక్కటే సరిపోదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆర్థిక విషయాల్లో స్పష్టత, భవిష్యత్తుపై ఒకే రకమైన ఆలోచనలు ఉండటం కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ పెళ్లికి ముందు ప్రతి ఒక్కరూ తమను తాము ఐదు ప్రశ్నలు వేసుకోవాలని సూచించారు. ఆయన లింక్డిన్ పోస్టులో పేర్కొన్న ఈ అంశాలు జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఆలోచించాల్సిన విషయాలను గుర్తుచేస్తున్నాయి.
1. పెళ్లి ఎందుకు?
తల్లిదండ్రుల ఒత్తిడి, సమాజం ఏమనుకుంటుందోనన్న భయం, వయసు పెరుగుతోందనే ఆందోళనతో పెళ్లికి సిద్ధపడుతున్నారా? లేక నిజంగా మీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉందా? ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఇతరుల కోసం కాకుండా, మీ ఇష్టంతోనే ఆ నిర్ణయం తీసుకుంటున్నారో? లేదో? ఆలోచించాలి.
2. గొడవలను ఎలా పరిష్కరించుకుంటారు?
భిన్నాభిప్రాయాలు రావడం సహజం. అయితే, గొడవ వచ్చినప్పుడు ఒకరినొకరు అవమానించుకుంటారా? ఎదుటివారి మాట వింటారా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెబుతారా? సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారా? అన్నది ముఖ్యం. సమస్యల నుంచి పారిపోకుండా, పరస్పర గౌరవంతో పరిష్కరించుకునే మనస్తత్వం ఉండాలి.
3. డబ్బు విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒక్కటేనా?
ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పులు, పెట్టుబడులపై ఇద్దరికీ స్పష్టత ఉండాలి. కుటుంబ బాధ్యతలను ఎలా పంచుకోవాలి? ఒకరికి ఉద్యోగం పోతే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? వంటి అంశాలపై ముందుగానే మాట్లాడుకోవాలి. ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉంటే భవిష్యత్తులో అపార్థాలు తగ్గుతాయి.
4. వ్యక్తిగత స్వేచ్ఛకు చోటుంటుందా?
పెళ్లయ్యాక స్నేహితులు, అభిరుచులు, వ్యక్తిగత ఆసక్తులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి జీవిస్తూనే తమకంటూ కొంత సమయం కేటాయించుకునే స్వేచ్ఛ ఉండాలి. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకోవాలి.
5. భవిష్యత్తుపై ఇద్దరి లక్ష్యాలు ఒక్కటేనా?
ఎక్కడ నివసించాలి? పిల్లలు కావాలా? కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉండాలి? ఇంటి పనులు, బాధ్యతలు ఎలా పంచుకోవాలి? ఉద్యోగరీత్యా మరో నగరానికి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి? ఇలాంటి విషయాలపై ముందుగానే చర్చించుకోవాలి. ప్రతి విషయంలో ఏకాభిప్రాయం అవసరం లేకపోయినా, విభేదాలను చర్చించుకునే సుముఖత ఉండాలి.
జీవిత భాగస్వామిని ఎంచుకోవడం మన జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఒకటని వారికూ అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం మానసిక, శారీరక, ఆర్థిక, భావోద్వేగ జీవితాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.