ఉద్యోగం కోసం రష్యా వెళ్లి.. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కామారెడ్డి వాసి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగం కోసం రష్యా వెళ్లి.. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కామారెడ్డి వాసి

Kamareddy man who went to Russia for job dies in war
  •  ఏజెంట్ మోసం.. సైనిక విధుల్లో చిక్కుకుని యువకుడి బలి
  • ఉద్యోగం పేరుతో రష్యా వెళ్లి సైనిక విధుల్లో చేరిక‌
  • సహచరుడి వాయిస్ మెసేజ్‌తో వెలుగులోకి వచ్చిన మరణవార్త
  • మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న కుటుంబం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో తెలంగాణ యువకుడిని బలి తీసుకున్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్ రష్యాలో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ వార్తతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలోని తాడ్కోల్ గ్రామ నివాసి అయిన అఫ్జల్ ఖాన్, ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా వెళ్లారు. అక్కడ సుమారు ఐదు నెలల పాటు మెకానిక్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఓ ఏజెంట్ ఆయనను మోసగించి రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో సైనిక సంబంధిత విధుల్లో చేర్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సుమారు 10 రోజుల క్రితం సరిహద్దు వద్ద జరిగిన పోరాటంలో అఫ్జల్ ఖాన్ మరణించారని, ఆయనతో పాటే రష్యా వెళ్లిన సహచరుడు శిర్షు అశోక్ ఒక వాయిస్ సందేశం ద్వారా కుటుంబానికి తెలియజేశాడు. ఈ సమాచారంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ మరణవార్తను ధ్రువీకరించాలని, నిజమైతే అఫ్జల్ ఖాన్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖను, మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని వేడుకున్నారు. 
Advertisement
Mohammed Afzal Khan
Russia Ukraine War
Kamareddy Telangana
Indian killed in Russia
Tadkol Banswada
Ministry of External Affairs

More Telugu News