భారత్‌లోకి చొరబడేందుకు యత్నం.. మందుపాతర పేలి లష్కరే కీలక కమాండర్ సహా నలుగురు ఉగ్రవాదులు మృతి!
- కృష్ణ ఘాటిలో మందుపాతరల పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి
- మృతుల్లో లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ ఫైజాన్ ఉన్నట్లు సమాచారం
- పూంఛ్ జిల్లాలో ఎల్‌ఓసీ వెంబడి భద్రత కట్టుదిట్టం
- సత్వాల్-నాకి ప్రాంతంలోనూ పేలుడు కలకలం
- మెంధర్‌లో రెండు పాత మందుపాతరలను నిర్వీర్యం చేసిన సైన్యం
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులు మందుపాతరల పేలుడులో మరణించారు. వీరిలో లష్కరే తోయిబా కీలక కమాండర్ మహమ్మద్ ఫైజాన్ కూడా ఉన్నట్లు సమాచారం. కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నాంగి టెక్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన మందుపాతరలు పేలడంతో నలుగురూ అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. మిగిలిన ముగ్గురిని వకాస్, ఇస్తియాక్, ఆసిమ్‌గా గుర్తించారు. ఎల్‌ఓసీ వెంబడి భద్రతా బలగాలు ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు, పర్యవేక్షణను మరింత పెంచారు.
కృష్ణ ఘాటి సెక్టార్‌లోని సత్వాల్-నాకి ప్రాంతంలో సోమవారం జీరో లైన్ సమీపంలో పేలుడు జరిగినట్లు అంతకుముందు సమాచారం అందింది. పాకిస్థాన్ వైపు ఎల్‌ఓసీ వెంబడి కదులుతున్న ఓ బృందం సమీపంలో అనుమానిత ఐఈడీ పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ బృందంలో చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు ఉన్నారా? లేక గస్తీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ భద్రతా సిబ్బందా? అన్నది తొలుత స్పష్టంకాలేదు. పేలుడుకు దారితీసిన పరిస్థితులపైనా అధికారులు ఆరా తీశారు.
మరోవైపు, మెంధర్ సెక్టార్‌లోని బసోని ప్రాంతంలో సరిహద్దు కంచె సమీపంలో రెండు పాత మందుపాతరలను సైన్యం గుర్తించింది. రహదారి మార్గం నిర్మాణ పనుల సమయంలో సోమవారం ఉదయం 8.25 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 12.10 గంటలకు మరొకటి బయటపడ్డాయి. సైనిక నిపుణులు నియంత్రిత పేలుళ్లతో వాటిని నిర్వీర్యం చేశారు. గత వారంలోనూ ఈ ప్రాంతంలో దాదాపు 12 మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు సమాచారం.
ఎల్‌ఓసీ ప్రాంతాల్లో చొరబాట్లను అడ్డుకునేందుకు మందుపాతరలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే భారీ వర్షాల కారణంగా అవి బయటపడి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో వాటిని గుర్తించడం, భద్రతను నిరంతరం పర్యవేక్షించడం సైన్యానికి సవాలుగా మారుతోంది.