బొల్లారం గేటెడ్ కమ్యూనిటీలో చిన్నారి దారుణ హత్య.. మాజీ సెక్యూరిటీ గార్డు అరెస్ట్
- సికింద్రాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య
- నిందితుడు, మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఉద్యోగం నుంచి తీసేశారన్న పగతో పాటు డబ్బు కోసమే దారుణం
- నిందితుడికి కఠిన శిక్ష పడాలంటూ తల్లిదండ్రులు, స్థానికుల ఆందోళన
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని పోలీసుల హామీ
సికింద్రాబాద్ బొల్లారంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దారుణానికి పాల్పడింది అదే కమ్యూనిటీ మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్ కుమార్ అని, అతడిరి అరెస్ట్ చేశామని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి సోమవారం ప్రకటించారు. ఉద్యోగం నుంచి తొలగించారన్న పగతో పాటు, డబ్బుల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని ఆమె తెలిపారు.
ఆదివారం విల్లా ఆర్కిడ్స్‌లోని క్లబ్‌హౌస్ సెల్లార్‌లో ఉన్న వాటర్ సంప్‌లో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీహార్‌కు చెందిన విక్రమ్ కుమార్‌ను ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు అరెస్ట్ చేశారు.
పోలీసు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కమిషనర్ సుమతి మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, చిన్నారి తల్లిదండ్రులు, కమ్యూనిటీ నివాసితులు పోలీసు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. "చిన్నారికి న్యాయం చేయాలి", "నిందితుడిని కఠినంగా శిక్షించాలి" వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ, తక్షణ న్యాయం జరగాలని కోరారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన డీసీపీ సి.హెచ్. శ్రీధర్, చట్ట ప్రకారం ముందుకెళతామని, ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. "మనం నాగరిక సమాజంలో ఉన్నాం. చట్టప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం" అని కమిషనర్ సుమతి స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
శనివారం సాయంత్రం క్లబ్‌హౌస్ సమీపంలో సైకిల్ ఆడుకుంటున్న చిన్నారిని విక్రమ్ కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. రాత్రి 7 గంటలైనా పాప ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఇంతలో, చిన్నారి తండ్రికి ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పాపను విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని దుండగుడు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత ఆ నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొదట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో, గేటెడ్ కమ్యూనిటీలోనే తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో క్లబ్‌హౌస్ వాటర్ సంప్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.
పగ, డబ్బే కారణం
పోలీసుల కథనం ప్రకారం, విక్రమ్ కుమార్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో అక్టోబర్ 6న అతడిని సెక్యూరిటీ గార్డు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ నిర్ణయం తీసుకున్న కమిటీలో చిన్నారి తాత కూడా ఉండటంతో, ఆయనపై పగ పెంచుకున్నాడు. ప్రతీకారంతో పాటు డబ్బు సంపాదించాలనే దురాలోచనతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విక్రమ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. చిన్నారిని తన వద్ద ఉంచుకుంటే దొరికిపోతానని, సీసీ కెమెరాలకు చిక్కకుండా గేటెడ్ కమ్యూనిటీ నుంచి బయటకు తీసుకెళ్లడం అసాధ్యమని భావించి, పొట్టకు ఇటుకలు కట్టి సంప్‌లో పడేసి హత్య చేసినట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.