ఫ్లాపులు తట్టుకోలేక పరేషాన్ అవుతున్న బ్యూటీలు!

ఫ్లాపులు తట్టుకోలేక పరేషాన్ అవుతున్న బ్యూటీలు!

Tollywood Heroines Special
  • ఫ్లాపులతో సతమతమైన కృతి శెట్టి
  •  చెలాకీగా ఉండే శ్రీలీలకి తప్పని తిప్పలు 
  • పాలరాతి శిల్పం అనిపించుకున్న భాగ్యశ్రీ బోర్సే
  • అదృష్టం కలిసిరాక తగ్గిన అవకాశాలు   
 
వెండితెరపై కథానాయిక అందంగా ఉండాలి .. ఆకర్షణీయంగా అనిపించాలి. దిష్టి చుక్క పెట్టని చందమామలా కనిపించాలి. లేదంటే ఆడియన్స్ నిరాశపడిపోతారు .. నిరుత్సాహానికి లోనవుతారు. తెరపై సమాజసేవలో అలసిపోయిన నాయకుడికి .. ఆ నాయకుడికి విజిల్స్ కొట్టి విసిగిపోయిన ఆడియన్స్ కి కాస్త ఉపశమనాన్ని కలిగించేది హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి  హీరోయిన్ అందంగా ఉండాలని అనుకోవడంలోను తప్పులేదు. 

అభిమానుల మనసు దోచుకుంటూ .. అవకాశాలను అందుకుంటూ .. విజయాలను సొంతం చేసుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఇక్కడ హిట్టు తప్ప వాళ్లను కాపాడే మరో మంత్రమే లేదు. ఒకప్పుడు హీరోయిన్స్ ఏళ్లతరబడి ఏలుతూ వెళ్లారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎంత గ్లామరస్ గా ఉన్నప్పటికీ .. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ రెండు మూడు ఫ్లాపులు పడితే అంతే సంగతులు. మేకప్ కిట్ సర్దుకుని మరో ఇండస్ట్రీకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.  

కృతి శెట్టి ఇచ్చిన ఎంట్రీ మామూలుగా లేదు. ఫస్టు మూవీతోనే 100 కోట్ల బ్యూటీగా మార్కులు కొట్టేసింది. అరుదైన ఫీట్ గా చెప్పుకునే హ్యాట్రిక్ హిట్ ను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కుదురుకున్నట్టే అనుకునేంతలోనే పరాజయాల పలకరింపు మొదలైంది. అప్పటి నుంచి కృతి శెట్టి ఇక్కడ కనిపించలేదు. ఆ సమయంలో వరుస విజయాలతో చెలరిగిపోయిన శ్రీలీలకి కూడా ఆ తరువాత ఫ్లాపులు తప్పలేదు. ఆమె జోరు తగ్గడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు.

ఈ నేపథ్యంలోనే విశాలమైన కళ్లతో విన్యాసాలు చేసుకుంటూ భాగ్యశ్రీ బోర్సే తెరపైకి వచ్చింది. అమ్మాయి గ్లామర్ కి వంకబెట్టవలసిన అవసరం లేదని ఆడియన్స్ అనుకున్నారు. కుర్రాళ్లంతా కూడబలుక్కుని ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు. కానీ సక్సెస్ అనేక విధాలుగా ఆమెతో దోబూచులాడుతూనే వచ్చింది. దాంతో ఆమె కూడా ఇతర భాషా చిత్రాల వైపు అడుగులు వేయవలసి వచ్చింది. ఎంత అందంగా ఉన్నా .. టాలెంట్ ఉన్నా కొంత కాలం కూడా నిలదొక్కుకోలేక పోతుండటం నిజంగా విచారించదగిన విషయమే. 

Advertisement
Krithi Shetty
Sreeleela
Bhagyashri Borse
Tollywood Actresses Flops
Telugu Cinema Heroines
South Indian Film Industry

More Telugu News