బెంగళూరులో చుక్కలు చూపిస్తున్న ఇంటి అద్దెలు.. లక్షల్లో డిపాజిట్, అద్దె రూ.60 వేలు
- బెంగళూరులో ఆకాశాన్నంటున్న ఇంటి అద్దెలు, డిపాజిట్లు
- ఇంటి వేటలో తన అనుభవాన్ని పంచుకున్న అనూమిక అనే మహిళ
- 2బీహెచ్‌కే ఇంటికి రూ. 60 వేల అద్దె, రూ. 8 లక్షల వరకు డిపాజిట్
- ప్రశ్నించకుండానే అధిక అద్దెలు చెల్లిస్తున్నారని ఆవేదన
- బ్యాచిలర్లతో పోలిస్తే కుటుంబాలకు కష్టాలు ఎక్కువని వెల్లడి
బెంగళూరులో ఆకాశన్నంటుతున్న ఇంటి అద్దెలు, భారీ సెక్యూరిటీ డిపాజిట్లపై ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసిన ఆవేదన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక సాధారణ 2బీహెచ్‌కే ఫ్లాట్‌కే నెలకు రూ.60,000 అద్దెతో పాటు రూ.లక్షల డిపాజిట్లు అడుగుతున్నారంటూ అనామిక అనే నెటిజన్ తన సోషల్ మీడియా పేర్కొన్నారు.
అనామిక తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తన కుటుంబం కోసం గత మూడు వారాలుగా బెంగళూరులో అద్దె ఇంటి వేటలో ఉన్నారు. ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఉండటంతో, కేవలం ఒకే ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం మొత్తం గాలించారు. అయినప్పటికీ, ఇప్పటికీ అనువైన ఇల్లు లభించలేదని ఆమె వాపోయారు. ఒకచోట 2BHK ఇంటికి రూ.60,000 అద్దె డిమాండ్ చేయడమే కాకుండా, దానికి అదనంగా రూ. 5,000 నుండి రూ. 7,000 వరకు మెయింటెనెన్స్ ఛార్జీలు అడుగుతున్నారని తెలిపారు.
అద్దెతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ భారం కూడా విపరీతంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇంటి యజమానులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, మరికొన్నిచోట్ల ఏకంగా రూ.8 లక్షలకు పైగా డిపాజిట్ డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. గత నాలుగైదేళ్లుగా తాను బెంగళూరులోనే నివసిస్తున్నప్పటికీ, ఈ అద్దె ఇళ్ల వేట పుణ్యమా అని నగరంలోని వీధులు, వివిధ ప్రాంతాల గురించి తనకు పూర్తి అవగాహన వచ్చిందని సెటైర్ వేశారు.
యజమానులు అడిగినంత అద్దెను ప్రజలు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా చెల్లించేస్తుండటం వల్లే ధరలు ఇలా పెరుగుతున్నాయని అనామిక అభిప్రాయపడ్డారు. బ్యాచిలర్లు అయితే ఒకే గదిని పంచుకుని ఖర్చును తగ్గించుకోగలరని, కానీ కుటుంబాలతో నివసించే వారికి ఈ ఆర్థిక భారం మోయలేనంతగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బెంగళూరులో అద్దె ఇళ్ల కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనంగా నిలుస్తోంది.