అఖిలేశ్‌ది సాఫ్ట్ హిందుత్వ.. 30 రోజుల డెడ్‌లైన్ విధించిన ముస్లిం మత పెద్ద

అఖిలేశ్‌ది సాఫ్ట్ హిందుత్వ.. 30 రోజుల డెడ్‌లైన్ విధించిన ముస్లిం మత పెద్ద

Akhilesh Yadav Soft Hindutva Muslim Religious Leader Sets 30 Day Deadline
  • అఖిలేశ్ యాదవ్ సాఫ్ట్ హిందుత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ
  • 2027 ఎన్నికల్లో ముస్లింను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్
  • ముస్లింలకు 150 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్
  • 30 రోజుల్లో డిమాండ్లు నెరవేర్చకపోతే వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరిక
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కు సొంత ఓటు బ్యాంకు నుంచే ఊహించని సవాల్ ఎదురైంది. అఖిలేష్ 'సాఫ్ట్ హిందుత్వ' రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారంటూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్‌ మత పెద్ద మౌలానా షాబుద్దీన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆయన మండిపడ్డారు.

రాబోయే 2027 యూపీ ఎన్నికల్లో పార్టీ తరఫున ముస్లిం నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షాబుద్దీన్ డిమాండ్ చేశారు. దీనితో పాటు సుమారు 150 అసెంబ్లీ స్థానాలను ముస్లిం అభ్యర్థులకే కేటాయించాలని కోరారు. ఈ డిమాండ్లను 30 రోజుల్లోగా అంగీకరించని పక్షంలో అఖిలేష్‌కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభిస్తామని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ జనాభాలో యాదవుల (7 శాతం) కంటే ముస్లింలే అధికంగా ఉన్నారని, అయినప్పటికీ తమకు సరైన రాజకీయ ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల అఖిలేష్ యాదవ్ హనుమాన్ చాలీసా పఠించడం, దేవాలయాల సందర్శనలు చేపట్టడం, తన పీడీఏ (పిచ్డా, దళిత్, అల్పసంఖ్యాక్) ఫార్ములాకు 'పండిట్'ను జోడించి బ్రాహ్మణులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం వంటి చర్యలు చేపట్టారు. హిందూ ఓటర్లకు చేరువయ్యేందుకు ఆయన ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని, ఈ క్రమంలోనే ముస్లిం మత పెద్దల నుంచి ఇటువంటి తీవ్ర వ్యతిరేకత వస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Akhilesh Yadav
Maulana Shahabuddin
Samajwadi Party
Uttar Pradesh Elections 2027
Soft Hindutva

More Telugu News