శబరిమల బోర్డుపై కేరళ మంత్రి సీరియస్.. హైకోర్టుకు వెళతానని హెచ్చరిక

శబరిమల బోర్డుపై కేరళ మంత్రి సీరియస్.. హైకోర్టుకు వెళతానని హెచ్చరిక

Kerala Minister serious on Sabarimala warns of High Court action
  • శబరిమలలో ప్రసాదం కొరతపై తీవ్ర వివాదం
  • దేవస్వం బోర్డుపై కేరళ మంత్రి మురళీధరన్ ఆగ్రహం
  • అవసరమైతే హైకోర్టుకు వెళతానని చ్చరిక
  • భక్తుల రద్దీ పెరగడంతోనే కొరత ఏర్పడిందన్న బోర్డు
  • విచారణ కమిటీ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తానన్న మంత్రి
ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రసాదాల కొరత తీవ్ర వివాదానికి దారితీసింది. భక్తులకు అరవణ పాయసం, అప్పం తగినంతగా అందకపోవడంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. మురళీధరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు వైఫల్యం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన హెచ్చరించారు.

ఆదివారం శబరిమలలో ప్రసాదాల కొరత ఏర్పడటంతో పంపిణీపై అధికారులు ఆంక్షలు విధించారు. ఒక్కో భక్తుడికి కేవలం ఒక అరవణ పాయసం టిన్, మూడు అప్పం ప్యాకెట్లు మాత్రమే అందజేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కౌంటర్లు మూసివేసి, తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

ఈ పరిణామాలపై దేవస్వం బోర్డు అధికారులు వివరణ ఇచ్చారు. కన్ని మాసం పూజల కోసం గత ఏడాది కంటే 50,000 అదనంగా, మొత్తం 2.6 లక్షల ప్రసాదం టిన్నులను సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే, ఈసారి ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరగడంతో కొరత ఏర్పడిందని వెల్లడించారు. సోమవారం నాటికి నిల్వల కేవలం 14,000 టిన్నులకు పరిమితమయ్యాయని పేర్కొన్నారు.

ప్రసాదం తయారీ కేంద్రంలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున ఈ సమస్య తలెత్తిందన్న బోర్డు వాదనను మంత్రి మురళీధరన్ తప్పుపట్టారు. ముందస్తు సమాచారం, సరైన ప్రణాళిక లేకుండా ఇలాంటి కీలక పనులు ఎలా చేపడతారని ఆయన నిలదీశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసే విషయంపై ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌తో చర్చిస్తానని మంత్రి స్పష్టం చేశారు.
Advertisement
K Muralidharan
Sabarimala
Aravana Payasam
Travancore Devaswom Board
Kerala Devaswom Minister

More Telugu News