అమెరికాలో పెరిగిన వడ్డీరేట్లు.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావమెంత?
- పావు శాతం పెరిగిన అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు
- 3.75-4 శాతానికి చేరిన ఫెడరల్ ఫండ్స్ రేట్లు
- ఫెడ్ నిర్ణయంతో రూపాయిపై ఒత్తిడి పెరిగే అవకాశం
- భారత్ నుంచి విదేశీ నిధుల ఉపసంహరణకు ఛాన్స్
- భారత ఈక్విటీ మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశం
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ఆ ప్రభావం అక్కడితో ఆగదు. డాలర్ బలపడటం నుంచి రూపాయి కదలిక వరకు.. విదేశీ పెట్టుబడుల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు దాని ప్రకంపనలు భారత్‌లోనూ కనిపిస్తాయి. తాజాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించేలా చేసింది.
పావు శాతం పెంపు
అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఫండ్స్ రేటును పావు శాతం పెంచింది. దీంతో వడ్డీ రేటు 3.75-4 శాతానికి చేరింది. ఈ ఏడాది మరోసారి రేటు పెంచే అవకాశం ఉందని కమిటీ సభ్యులు అంచనా వేశారు.
ద్రవ్యోల్బణం ఇంకా ఫెడ్ లక్ష్యమైన రెండు శాతానికి పైనే ఉంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఇంధన ధరల ప్రభావం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. లేబర్ మార్కెట్ మాత్రం కొంత స్థిరంగా ఉంది.
రూపాయిపై ఒత్తిడి
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలపడే అవకాశం ఉంటుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి పెరగొచ్చు. 2026లో ఇప్పటికే పలుమార్లు రికార్డు కనిష్ఠాలను తాకిన రూపాయి మరింత బలహీనపడితే దిగుమతుల వ్యయం పెరుగుతుంది. ముఖ్యంగా ముడిచమురు ధరల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముంది.
విదేశీ పెట్టుబడులపై ప్రభావం
అమెరికన్ అసెట్స్‌లో అధిక రాబడులు కనిపిస్తే అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్ నుంచి నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. 2026లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. ఫెడ్ నిర్ణయంతో అమ్మకాలు మరింత పెరిగితే ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి రావొచ్చు.
చమురు.. మరో కీలక అంశం
ఫెడ్ నిర్ణయం అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లపైనా ప్రభావం చూపొచ్చు. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముడిచమురు ధరల్లో మార్పులు దేశ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయి.
ఆర్‌బీఐపై పెరిగిన ఒత్తిడి
అమెరికా వడ్డీ రేట్ల మార్పును ఆర్‌బీఐ నిశితంగా గమనిస్తూ ఉంటుంది. భారత్-అమెరికా వడ్డీ వ్యత్యాసం, విదేశీ నిధుల ప్రవాహం, రూపాయి విలువ కీలకంగా మారతాయి. అయితే దేశీయ ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాల ఆధారంగానే ఆర్‌బీఐ తన నిర్ణయాలు తీసుకుంటుంది.
రూపాయి స్థిరత్వం, మూలధన ప్రవాహాలపై ఒత్తిడి పెరిగితే ఆర్‌బీఐ ముందు కొత్త సవాళ్లు నిలవొచ్చు. అవసరమైతే రెపో రేటు పెంపు దిశగా ఆలోచించాల్సి రావచ్చు. అలా జరిగితే బ్యాంకు రుణాలపై వడ్డీ భారం పెరిగి, వినియోగదారులు, వ్యాపారాలపై అదనపు భారమయ్యే అవకాశం ఉంది.