ఇరాన్‌పై ఉచ్చు బిగిస్తున్న అమెరికా.. 2027 వరకు బలగాల మోహరింపు పొడిగింపు!
- ఇరాన్‌పై వ్యూహంలో భాగంగా 50,000 మంది సైనికులు, 19 యుద్ధ నౌకల మోహరింపు
- సైనికుల సేవా కాలం పొడిగింపుతో వారిపై పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి
- సైనిక చర్యలతో పాటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే అమెరికా లక్ష్యం
- ఎప్పుడైనా దాడికి సిద్ధమంటూ ఇరాన్‌కు ట్రంప్ బహిరంగ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో మోహరించిన తమ సైనిక బలగాల గడువును 2027 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యుద్ధ విషయంలో మరిన్ని ప్రత్యామ్నాయాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన దీర్ఘకాలిక సైనిక వ్యూహంలో భాగమని 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో వెల్లడించింది. ఇరాన్‌పై సైనిక చర్యలు, ఆర్థిక ఒత్తిడి, అవసరమైతే విస్తృత స్థాయి యుద్ధం వంటి అంశాలను ట్రంప్ పరిశీలనలో ఉంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదట ఇరాన్‌పై స్వల్పకాలిక, నిర్ణయాత్మక సైనిక చర్యగా ప్రచారం చేసినప్పటికీ, ఇప్పుడు ఈ మోహరింపు భారీగా విస్తరించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు, 19 యుద్ధ నౌకలు, ఫైటర్ స్క్వాడ్రన్లు, వాయు రక్షణ విభాగాలు, పారాట్రూపర్లు మోహరించి ఉన్నారు. ఈ సుదీర్ఘ మోహరింపు కారణంగా అమెరికా సైనికులు, వారి కుటుంబాలు, సైనిక పరికరాలపై తీవ్ర భారం పడుతోందని 'వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది. ఆర్మీ ఎయిర్ డిఫెండర్ల సేవా కాలాన్ని 9 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. యూరప్, పసిఫిక్ ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని యూనిట్లు ఏడాదికి పైగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాయి.
నౌకాదళం కూడా ఇదే విధమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం రెండు విమానవాహక నౌకలు, 13 గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్‌లతో సహా మొత్తం 19 యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. యుద్ధం ప్రారంభంలో పంపిన యూఎస్‌ఎస్ డెల్బర్ట్ డి. బ్లాక్, యూఎస్‌ఎస్ స్ప్రూయన్స్ వంటి నౌకలు, వాటిలోని 300 మంది సిబ్బంది నెలల తరబడి విరామం లేకుండా సముద్రంలోనే గడుపుతున్నారు.
అదే సమయంలో ట్రంప్ యంత్రాంగం ఇరాన్‌పై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ప్రయోగించడం ద్వారా ఆ దేశ నాయకత్వాన్ని తిరిగి చర్చల టేబుల్‌పైకి తీసుకురావాలని వ్యూహరచన చేస్తోంది. ఆర్థిక ఒత్తిడితోనే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందని, అందుకే ఈ యుద్ధాన్ని ముగిసినట్లుగా ప్రకటించడంపై ట్రంప్ తన సీనియర్ సహాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "హర్మూజ్ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. వాళ్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ఇరాన్ ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు?" అని రాశారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ.. "ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులు చేసేందుకు అమెరికా పూర్తి సన్నద్ధంగా ఉంది. మేము వారి రాడార్ వ్యవస్థను ధ్వంసం చేశాం. వాళ్లు ఏం చేస్తున్నారో మాకు అన్నీ తెలుసు. వాళ్లు బాత్రూమ్‌కు వెళ్లినా మేము చూడగలం" అని వ్యాఖ్యానించారు.
రాబోయే నవంబర్ మధ్యంతర ఎన్నికలపై ఈ యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతుందని ట్రంప్ సహాయకులు ఆందోళన చెందుతున్నప్పటికీ, ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తాను నిర్ణయాలు తీసుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. సైనిక చర్యలతో పాటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి, ఆ దేశ వాణిజ్య భాగస్వాములపై ఆంక్షలు విధించడం ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది.