హైదరాబాద్‌లో 24 గంటలూ బస్సులు.. నేటి నుంచి 6 రూట్లలో నైట్ సర్వీసులు
- ఐటీ, ఇతర రాత్రి షిఫ్ట్ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్ణయం
- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బస్సులు
- డిమాండ్‌ను బట్టి మరిన్ని రూట్లలో విస్తరణకు ఆర్టీసీ ప్రణాళిక
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం (సెప్టెంబర్ 1) నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రిపూట బస్సు సర్వీసులను పునఃప్రారంభించింది. రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.శ్రీధర్ ఈ వివరాలను వెల్లడించారు. ఐటీ కారిడార్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను కలుపుతూ మొత్తం 15 బస్సులతో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, డిమాండ్‌ను బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని ఆయన వివరించారు. గతంలో 'నైట్ రైడర్స్' పేరుతో ఆర్టీసీ ఇలాంటి సర్వీసులను నడిపినప్పటికీ, ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో వాటిని నిలిపివేసింది. అయితే, ప్రస్తుతం నగరంలో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ, హాస్పిటాలిటీ రంగాల సిబ్బంది, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వీసులను మళ్లీ ప్రారంభించారు.
ప్రస్తుతం నడిచే ఆరు రూట్ల వివరాలు
222A: కోఠి నుంచి పటాన్‌చెరు (అబిడ్స్, లక్డీకాపూల్, కొండాపూర్ మీదుగా) - ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు
218: అఫ్జల్‌గంజ్/సీబీఎస్ నుంచి పటాన్‌చెరు (కోఠి, కేపీహెచ్‌బీ, మియాపూర్ మీదుగా)
219: సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు (ప్యారడైజ్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మీదుగా)
290U: హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ (ఎల్‌బీ నగర్, నాగోల్, తార్నాక మీదుగా)
195W: బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ (ఐటీ క్యాంపస్‌ల మీదుగా)
10H: కొండాపూర్ నుంచి సికింద్రాబాద్
ఈ నైట్ బస్సులు రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు యాప్ ఆధారిత క్యాబ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సర్వీసులకు సంబంధించిన మరింత సమాచారం కోసం 99592 26160 నంబర్‌లో సంప్రదించవచ్చని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.