2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.. ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా సమీక్ష
- 2036 ఒలింపిక్స్ బిడ్డింగ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష
- అహ్మదాబాద్ వేదికగా పలు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్లాన్
- 2030 కామన్వెల్త్, 2029 పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌పై కూడా చర్చ
- భారత్‌ను గ్లోబల్ స్పోర్టింగ్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యమన్న అమిత్ షా
- సన్నాహకాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి
భారత్‌లో అంతర్జాతీయ క్రీడా సంబరాలకు రంగం సిద్ధమవుతోంది. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆ దిశగా సన్నాహకాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒలింపిక్స్ బిడ్డింగ్ ప్రక్రియ పురోగతిని, క్రీడల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు.
ఒలింపిక్స్‌తో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2029లో జరగనున్న పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌ను కూడా అహ్మదాబాద్‌లోనే నిర్వహించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సమావేశం అనంతరం అమిత్ షా 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. "అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించడం ద్వారా భారత్‌ను గ్లోబల్ స్పోర్టింగ్ డెస్టినేషన్‌గా నిలబెట్టడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో క్రీడల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లపై అధికారులు అమిత్ షాకు వివరించారు.
ఇటీవల గ్లాస్గోలో 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత, తదుపరి ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ తరఫున గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కామన్వెల్త్ గేమ్స్ పతాకాన్ని అందుకున్న విషయం విదితమే.