కల్వర్టు అనుమతికి లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఏఈ

Irrigation EE DE and AE caught red handed taking bribe for culvert permission
  • నెల్లూరులో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు ఇరిగేషన్ అధికారులు
  • కల్వర్టు అనుమతి కోసం రైతు నుంచి రూ. 3 లక్షలు స్వీకరిస్తుండగా ప‌ట్టివేత‌
  • రూ. 4 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
నెల్లూరు జిల్లాలో ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి రూ. 3 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఈఈ మహేశ్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ నారాయణరాజులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. కలువాయి మండలం మద్దూరుపల్లి గ్రామానికి చెందిన రైతు అంబటి చిరంజీవి, తన పొలం వద్ద గల కాలువపై కల్వర్టు నిర్మించుకునేందుకు అనుమతి (ఎన్ఓసీ) కోసం నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించారు. అయితే, ఆ ఎన్ఓసీ జారీ చేసేందుకు సదరు అధికారులు రూ. 4 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు.

దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి వ్యూహం ప్రకారం, గురువారం బాధితుడి నుంచి రూ. 3 లక్షలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ముగ్గురు అధికారులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఈ ఘటన జిల్లా నీటిపారుదల శాఖలో తీవ్ర కలకలం రేపింది.                                
Advertisement
Nellore Irrigation Officials
ACB Raid
Culvert NOC Bribe
Andhra Pradesh ACB
EE Mahesh
Irrigation Corruption Case

More Telugu News