పెళ్లికి ఒత్తిడి.. ప్రియురాలి హత్యకు కన్నతండ్రి ప్రోత్సాహం!
- ఎల్కతుర్తిలో కారు డిక్కీలో బయటపడిన మహిళ మృతదేహం కేసులో వీడిన మిస్టరీ
- కుమార్తెను హత్య చేసేందుకు ప్రియుడిని ప్రోత్సహించిన కన్నతండ్రి
- హంతకుడు వినోద్ కుమార్ అరెస్ట్.. పరారీలో తండ్రి రాజేశం
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని ఓ ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. అయితే, ఈ హత్య వెనుక ఆమె కన్నతండ్రి ప్రోత్సాహం ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేయగా, హత్యకు పురిగొల్పిన మృతురాలి తండ్రి పరారీలో ఉన్నాడు.
సోమవారం కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21న ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కారు డిక్కీని తెరిచి చూడగా, ఓ మహిళ మృతదేహం కనిపించింది. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, మృతురాలిని పెద్దపల్లి జిల్లాకు చెందిన అంకతి మానస (33)గా, నిందితుడిని ఎల్కతుర్తికి చెందిన ఎడెళ్లి వినోద్ కుమార్ (33)గా గుర్తించారు. ఆదివారం వినోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
నిందితుడు వినోద్ తండ్రి, మృతురాలు మానస తండ్రి రాజేశం గతంలో సింగరేణిలో కలిసి పనిచేయడంతో ఇరువురి మధ్య స్నేహం ఉంది. మానసకు గతంలో రెండుసార్లు వివాహమై, విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఈ క్రమంలో పాత స్నేహితుడైన వినోద్ కుమార్‌తో మానసకు సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని ఆమె వినోద్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, వినోద్ ఈ విషయాన్ని ఆమె తండ్రి రాజేశానికి ఫోన్ చేసి చెప్పాడు.
దీనికి స్పందించిన రాజేశం.. తన కూతురు బతికుంటే అందరినీ ఇబ్బంది పెడుతుందని, ఏదో ఒకటి చేసి ఆ బాధ తమకు లేకుండా చేయాలని వినోద్‌ను పురిగొల్పాడు. అతడి మాటలతో ప్రేరణ పొందిన వినోద్.. కరీంనగర్‌లోని తన అద్దె ఇంట్లో మానస గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బెడ్‌షీట్‌లో చుట్టి కారు డిక్కీలో వేసుకుని ఎల్కతుర్తికి తీసుకొచ్చాడు. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన కారును వదిలేసి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ హత్య కేసులో నిందితుడు వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్యకు ప్రేరేపించిన మానస తండ్రి రాజేశంపై కూడా కేసు నమోదు చేశామని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.