ప్రేమ కోసం తల్లిదండ్రుల హత్య.. చివరకు ప్రాణాలు తీసుకున్న సురేఖ

Surekha killed parents for love and finally ends her life
  • తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సురేఖ ఆత్మహత్య
  • సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి
  • ప్రేమను నిరాకరించారని కన్నవారిని ఇంజక్షన్‌తో హతమార్చిన నర్సు
  • బెయిల్‌పై విడుదలై ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఘటన
  • తాను బతకాలనుకోవడం లేదంటూ సూసైడ్ నోట్
కన్న తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ (25), సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.

వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్న సురేఖ, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించింది. అయితే వీరి వివాహానికి ఆమె తల్లిదండ్రులు దశరథం, లక్ష్మి అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ, ఒళ్లు నొప్పుల నెపంతో తల్లిదండ్రులిద్దరికీ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ డబుల్ మర్డర్ కేసులో ఆమె పాత్రను నిర్ధారించిన పోలీసులు, సురేఖను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

జులై 31న బెయిల్‌పై విడుదలైన సురేఖ, సంగారెడ్డిలోని శాంతినగర్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ వేటలో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె తన గదిలో విగతజీవిగా కనిపించింది. ఘటనా స్థలంలో "నేను ఇక బతకాలనుకోవడం లేదు" అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి సోదరుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.                                
Advertisement
Surekha
Sangareddy hostel suicide
Parents double murder case
Vikarabad nurse murder case
Surekha suicide note
Sangareddy town police

More Telugu News