రేపు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఉపరాష్ట్రపతితో కలిసి వినూత్న మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ
- సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
- ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి కొత్త విత్తన రకం ఆవిష్కరణ
- దేశంలోనే తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మొక్కజొన్న వంగడం ఇదే
- ముసునూరులోని గోర్మే పాప్‌కార్నికా ప్లాంట్‌లో ఈ కార్యక్రమం
- వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ ప్రయోగం లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఆగస్టు 24) ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి దేశంలోనే మొట్టమొదటి నాన్-జీఎంఓ (జన్యుపరంగా మార్పు చేయని) పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఏలూరు జిల్లా ముసునూరులోని గోర్మే పాప్‌కార్నికా సంస్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రైతులు పండించిన పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్, బ్రాండింగ్‌తో మార్కెట్‌కు తరలించడం ద్వారా వారి ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో ముసునూరు వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. గోర్మే పాప్‌కార్నికా సంస్థ ఆధ్వర్యంలో ఈ కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్నను సాగు చేస్తూ, వేలాది మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ముసునూరులో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్, ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరా చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
సీఎం పర్యటన వివరాలు
సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 9:55 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, 10:15 గంటలకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చేరుకుంటారు. ఉదయం 10:45 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం ఉదయం 11 గంటలకు జరిగే హైబ్రిడ్ మొక్కజొన్న విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక, మధ్యాహ్నం 1:20 గంటలకు తిరిగి రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.