బంగ్లాదేశ్‌లో దారుణం.. రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబం హత్య
- రిటైర్డ్ టీచర్, భార్య, ఇద్దరు పిల్లలతో సహా నలుగురిని హతమార్చిన దుండగులు
- డ్రగ్స్ తీసుకుంటుండగా అడ్డుకున్నందుకే ఈ ఘాతుకం
- ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
బంగ్లాదేశ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రంగ్‌పూర్ నగరంలో నివసిస్తున్న ఓ రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబాన్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న యువకులను అడ్డుకున్నందుకు వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, రంగ్‌పూర్ నగరంలోని దాస్‌పారా ప్రాంతంలో రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65) తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి (23), కుమారుడు ప్రియం చక్రవర్తి (12) ఉన్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, గురువారం రాత్రి ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకునేందుకు పక్క భవనం మీదుగా గణపతి ఇంటి పైకప్పుపైకి వచ్చారు. శబ్దం విని మేడపైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో నిందితులు ఓ తువ్వాలుతో ఆయన గొంతు నులిమి చంపేశారు.
ఆ తర్వాత పైకి వచ్చిన గణపతి భార్య ప్రీతిలతను కూడా ఓ వస్త్రంతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం కిందకు వెళ్లి వారి కుమార్తె, కుమారుడిని కూడా దారుణంగా హతమార్చారు. గురువారం నుంచి కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గణపతి మృతదేహం ఇంటి పైకప్పుపైనా, భార్య, కుమార్తె మృతదేహాలు మెట్లపైనా, కుమారుడి మృతదేహం మంచం కింద పడి ఉన్నాయి.
గణపతి చక్రవర్తి స్థానిక జిల్లా స్కూల్‌లో టీచర్‌గా పనిచేసి గతేడాది డిసెంబర్‌లో రిటైర్ అయ్యారు. ఆయన కుమార్తె ఇంగ్లీషులో మాస్టర్స్ పూర్తి చేయగా, కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడు. గణపతికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఆయన చాలా మంచివారని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు బంధువులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.