కూతురి వయసు అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు!

Sunita Ahuja sensational comments on Govinda roaming with daughter aged girl
  • ‘షుగర్ డ్యాడీ’ అంటూ మరోసారి సెటైర్
  • ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అటూ విమర్శలు
  • గతంలో ట్రోలింగ్‌ చేశారంటూ అభిమానులపై ఆగ్రహం
  • ఇప్పుడు వారే సమాధానం చెప్పాలని వ్యాఖ్య
బాలీవుడ్‌ నటుడు గోవిందా, నటి కోమల్‌ రాణి మధ్య డేటింగ్‌ రూమర్లపై ఆయన భార్య సునీతా అహూజా తీవ్రంగా స్పందించారు. కూతురి వయసున్న అమ్మాయితో గోవిందా తిరుగుతున్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.

“కూతురి వయసున్న అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు.. సిగ్గుపడాలి” అంటూ సునీతా గోవిందాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆయన్ను ‘షుగర్ డ్యాడీ’ అంటూ మరోసారి విమర్శించారు.

గోవిందా, కోమల్‌ రాణి కలిసి విమానాశ్రయంలో కనిపించడంపై సునీతను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆమె.. గోవిందా చేస్తున్న పనులకు కారణం ఆయనకు ‘వినాశకాలే విపరీత బుద్ధి’ పట్టడమేనంటూ వ్యాఖ్యానించారు.

ఇక గోవిందా, కోమల్‌ రాణి నటిస్తున్న ‘రూపా’ సినిమా ప్రమోషన్‌ గురించి ప్రశ్నించగా.. సినిమా పూర్తయిన తర్వాతే ప్రమోషన్‌ చేయాలని ఆమె అన్నారు.

గతంలో గోవిందాపై తాను చేసిన ఆరోపణల కారణంగా ట్రోలింగ్‌ ఎదుర్కొన్నానని సునీత గుర్తుచేశారు. ఇప్పుడు గోవిందా అభిమానులు, మీడియానే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. ఇక తనను ఏమీ అడగొద్దని అన్నారు.
Advertisement
Govinda
Sunita Ahuja
Komal Rani
Govinda dating rumors
Bollywood celebrity news
Roopa movie

More Telugu News