మహిళలను గౌరవించకపోతే కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తాం: యష్ ‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ ఫైర్

Rishika Singh slams Yash Toxic trailer for disrespecting women
  • 'టాక్సిక్' ట్రైలర్‌లో బోల్డ్ సన్నివేశాలు
  • హీరోయిన్ల పాత్రలను గౌరవంగా చూపించలేదన్న రిషికా సింగ్
  • ఇలాంటి కంటెంట్‌కు యష్ ఎలా ఒప్పుకున్నారని ప్రశ్న

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’ ట్రైలర్‌పై ప్రముఖ కన్నడ నటి రిషికా సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాలో బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, మహిళలను చూపించిన విధానంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు.  


తమిళం, కన్నడ, బాలీవుడ్ నుంచి నయనతార, కియారా అద్వానీ వంటి అగ్ర నటీమణులు ఉన్నప్పటికీ, వారి పాత్రలను గౌరవప్రదంగా చూపించలేదని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా ట్రైలర్‌లో ఒక మహిళ పాత్రను ఉద్దేశించి ‘రేట్ ఎంత’ అని అడిగే సంభాషణలను, సన్నివేశాలను తీవ్రంగా ఖండించారు. యష్ స్వయంగా ఒక భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఉంటూ ఇలాంటి కంటెంట్‌కు ఎలా అంగీకరించారని ఆమె ప్రశ్నించారు.


దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ విదేశాల్లో చదువుకోవడం వల్ల స్థానిక సంస్కృతి, విలువలు తెలియకపోవచ్చని... కానీ కర్ణాటకకు చెందిన యష్ దీనికి ఎలా ఒప్పుకున్నారని నిలదీశారు. వీడియో చివర్లో మాట్లాడూ... మహిళలకు తగిన గౌరవం ఇవ్వకపోతే మిమ్మల్ని కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తామని హెచ్చరిస్తూ, "నేను కూడా టాక్సిక్" అంటూ కామెంట్ చేశారు.

Advertisement
Rishika Singh
Yash
Toxic Movie Trailer
Geethu Mohandas
Nayanthara
Kiara Advani

More Telugu News