ఓ రేంజిలో 'శ్రీనివాస మంగాపురం' ట్రైలర్... రొమాన్స్, యాక్షన్‌తో అదరగొట్టిన జయకృష్ణ
- విడుదలైన శ్రీనివాస మంగాపురం థియేట్రికల్ ట్రైలర్
- హీరోగా జయకృష్ణ ఘట్టమనేని, హీరోయిన్‌గా రాషా థడానీ అరంగేట్రం
- రొమాన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న అజయ్ భూపతి మేకింగ్
- వెంకటప్పయ్య నాయుడిగా మోహన్ బాబు పవర్ ఫుల్ రోల్
- జూలై 30న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం'. మహేశ్ బాబు అన్న (రమేశ్ బాబు) కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందనతో దూసుకుపోతోంది. జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్‌ను గమనిస్తే, తిరుపతి నేపథ్యంలో సాగే ఓ అందమైన, అమాయకమైన ప్రేమకథతో ప్రారంభమైంది. శ్రీను (జయకృష్ణ), మంగ (రాషా) మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రశాంతంగా సాగుతున్న ఈ ప్రేమకథలోకి యాక్షన్ ఎంటర్ అవ్వడంతో కథనం ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. ప్రేమ, భావోద్వేగాలతో పాటు యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉన్నట్టు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, వెంకటప్పయ్య నాయుడు పాత్రలో మోహన్ బాబు ఎంట్రీ, ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ ఘట్టమనేని, తొలి సినిమాలోనే ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో ఎంత సున్నితంగా కనిపించాడో, యాక్షన్ సీక్వెన్స్‌లో అంతే పవర్‌ఫుల్‌గా అదరగొట్టాడు. ఇక, తెలుగు తెరకు పరిచయమవుతున్న రాషా థడానీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తెరపై ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సాంకేతికంగానూ ట్రైలర్ ఉన్నత స్థాయిలో ఉంది. తిరుపతి అందాలను కెమెరామెన్ అద్భుతంగా బంధించారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చింది.
చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్‌ను సరైన పాళ్లలో మిక్స్ చేసి, కథలోని ప్రధానమైన ట్విస్టులను రివీల్ చేయకుండా కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. అజయ్ భూపతి మార్క్ మరోసారి స్పష్టంగా కనిపించడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.