అఖిల్.. అక్కినేని కుటుంబంలో నువ్వే బెస్ట్ యాక్టర్... నాగార్జున మీద ఒట్టు: రామ్ గోపాల్ వర్మ
- అఖిల్ కెరీర్ లో లెనిన్ తో అసలైన హిట్ పడిన వైనం
- తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన వర్మ
- అఖిల్ నటనపై ప్రశంసల వర్షం
- తనదైన శైలిలో ట్వీట్
తనదైన శైలిలో అభిప్రాయాలు వెల్లడిస్తూ నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా యువ హీరో అఖిల్ అక్కినేనిపై ప్రశంసల వర్షం కురిపించారు. అక్కినేని కుటుంబంలో అఖిలే అత్యుత్తమ నటుడని, ఈ మాటను నాగార్జునపై ఒట్టేసి చెబుతున్నానంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' చూసిన తర్వాత వర్మ ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. "అఖిల్.. ఇప్పుడే 'లెనిన్' చూశాను. సినిమా అద్భుతంగా ఉండటమే కాకుండా, అక్కినేని కుటుంబంలో నువ్వే అత్యుత్తమ నటుడివి అని గ్రహించాను. నాగార్జునపై ఒట్టు!" అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
భావోద్వేగాలు లేని సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో చూపిన సహజత్వం (ease) అద్భుతంగా ఉందని వర్మ కొనియాడారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో అఖిల్ నటనతో అదరగొట్టేశాడని (KILLED it) అన్నారు. అఖిల్‌కు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరిని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ వర్గాల్లో, అక్కినేని అభిమానుల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ నెల 10న విడుదలైన లెనిన్ చిత్రం అఖిల్ కెరీర్ లోనే భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇందులో అఖిల్ సరసన భారతి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే అందంగా ఒదిగిపోయింది. ఈ చిత్రానికి నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరించారు.