ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం ఇదే: ప్రకాశ్ రాజ్
- విమర్శకులపై వీడియో పోస్ట్ చేసిన నటుడు ప్రకాశ్ రాజ్
- 'దిగజారండి' అంటూ వ్యంగ్యంగా స్పందించిన వైనం
- జనసైనికులు, కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు
- అబద్ధాలు, కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరని స్పష్టం
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో, వ్యంగ్యంగా స్పందించారు. 'దిగజారండి' అంటూ విమర్శకులను ఉద్దేశించి ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను మౌనంగా లేనని, అన్నీ గమనిస్తున్నానని చెబుతూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.
"నేను మౌనంగా లేను. అన్నీ చూస్తున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ల పలుకుబడితో జనసైనికులు, కొందరికి అమ్ముడుపోయిన చానళ్లు, యూట్యూబర్లు... సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు అల్లుతున్న కట్టుకథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఒక్కటే.. దిగజారండి... దిగజారండి... దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. అయితే, దిగజారడం అనే సామర్థ్యంపై మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి... అరుస్తూ దిగజారండి... నాలుగు వైపుల నుంచి దిగజారండి... సిగ్గులేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. ఎంత చేసినా ప్రశ్నించే గొంతుకలను మాత్రం ఆపలేరు. మీ పని మీరు కానివ్వండి... దిగజారుతూనే ఉండండి.. జస్ట్ ఆస్కింగ్.." అంటూ తన వీడియోను ముగించారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.