రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర
- ఫ్లోర్ లీడర్‌గా ముగిసిన సురేశ్ రెడ్డి పదవీకాలం
- ఆ స్థానంలో రవిచంద్రను నియమించిన కేసీఆర్
- కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మున్నూరు కాపు సంఘం
రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సురేశ్ రెడ్డి పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఫ్లోర్ లీడర్‌గా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. పార్టీ కోసం వద్దిరాజు చేసిన సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
ఈ నియామకం పట్ల తెలంగాణ మున్నూరు కాపు సంఘం నాయకులు పార్టీ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వద్దిరాజు రవిచంద్రకు ఈ ఉన్నత పదవి దక్కడం బీసీల ఎదుగుదలకు, తెలంగాణ హక్కుల సాధనకు ఎంతో కీలకంగా మారుతుందని మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన రాజ్యాంగపరమైన నిధులు, హక్కుల సాధనలో వద్దిరాజు పార్లమెంట్‌లో మరింత సమర్థవంతంగా గళం విప్పుతారని మున్నూరు కాపు సమాజం ఆశాభావం వ్యక్తం చేసింది.